అన్నమయ్య జిల్లాలో నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్గా రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. 2009లో రిజర్వ్ ఎస్సైగా సేవలు ప్రారంభించిన రవికుమార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు గ్రేహౌండ్స్ విభాగంలోనూ పనిచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో రిజర్వ్ పోలీసుల పాత్ర కీలకమని, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ శాఖ ప్రతిష్టను పెంచాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు










