అమరావతిలో దేశ తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం.

0
2

ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్ (‘అమరావతి 1Q’), ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో (‘అమరావతి 1S’) ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

అమరావతిని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చేందుకు 50 ఎకరాల్లో ‘అమరావతి క్వాంటం వ్యాలీ (AQV)’ నిర్మిస్తున్నారు. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల భాగస్వామ్యంతో హార్డ్‌వేర్ తయారీ, ఔషధ పరిశోధనలు, రక్షణ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.