ఈ నెల 12న మంచిర్యాలలో కేటీఆర్ పర్యటన.

0
0

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 12న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి కట్టుబడి ఉన్న క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, సభ్యులను ఆయన సన్మానిస్తారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహానికి హాజరై, మధ్యాహ్నం బాల్క సుమన్ నివాసంలో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ పర్యటన ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారు.