“ఎక్స్‌ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !

0
10

తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్‌జీఏ (PLGA) కీలక కమాండర్‌తో సహా 42 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోయారు. వీరి నుంచి ఆయుధాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలో మావోయిస్టుల సాయుధ శక్తి క్షీణించిందని, పీఎల్‌జీఏ కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయని డీజీపీ ప్రకటించారు. ప్రభుత్వ పునరావాస విధానాల పట్ల ఆకర్షితులై వీరు జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ పరిణామంతో తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం అంతిమ దశకు చేరుకుందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

#sidhumaroju