వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన తనయుడు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 2003 ఏప్రిల్ 9న ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మొదలైన ఆ యాత్ర రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిందని పేర్కొన్నారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పోలవరం వంటి పథకాలతో రైతులు, పేదలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. నాన్న వేసిన ఆ ప్రగతి ముద్ర స్ఫూర్తితోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.










