“దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|

0
9

సికింద్రాబాద్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి అన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 7.5 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

షేర్ మార్కెట్‌లో నష్టాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇతడు దొంగతనాలకు అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు. కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే మహిళల మెడలోని గొలుసులను ఇతడు అపహరించినట్లు నిర్ధారించి, రిమాండ్‌కు తరలించారు.

#sidhumaroju

Alwal