నందవరం మండల కేంద్రాన్ని పరిశీలించిన బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి

0
0

నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి గారు ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డి కుంట చెరువును సందర్శించి, నాలుగు దశల్లో చేపట్టే చెరువుల పునరుద్ధరణ పనుల గురించి వివరించారు.

అనంతరం ఎన్‌టీఆర్ సుజల ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించి, అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.