MAHABUBABAD,APRIL10: TGSRTC సంస్థ ఆదేశానుసారం మహబూబాబాద్ డిపో లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా తార్నాక హాస్పిటల్ నుండి డాక్టర్ ప్రశాంతి మేడం గారు విచ్చేసి టీం మహబూబాబాద్ డిపో ఉద్యోగులకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు ఆహార అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిపో మేనేజర్ వి కళ్యాణి గారు, తార్నాక డాక్టర్ ప్రశాంతి గారు, ఎంఎఫ్ పాపిరెడ్డి గారు, ట్రాఫిక్ సూపర్వైజర్ ఎంఆర్ రెడ్డి గారు, ఆఫీస్ సూపర్డెంట్ శ్రీమన్నారాయణ గారు, సెక్యూరిటీ ఇంచార్జ్ పీ.ఎం. రెడ్డి గారు,సీనియర్ అసిస్టెంట్ రుక్మిణిగారు, ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్స్ నబి, ఆఫీస్ సిబ్బంది గ్యారేజ్ సిబ్బంది మరియు టీమ్ మహబూబాబాద్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.










