విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లులు మాల్కు కేటాయిస్తూ ఇచ్చిన జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ప్రజా పోరాట విజయమని సీపీఎం నేత సి.హెచ్. బాబురావు పేర్కొన్నారు. రూ.400 కోట్ల విలువైన 4.17 ఎకరాల భూమిని కారుచౌకగా బడా సంస్థకు లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఐక్య ఉద్యమాలు, న్యాయపోరాటం వల్ల ప్రభుత్వం దిగివచ్చిందని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్లకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తే సహించబోమని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం భవిష్యత్తులోనూ పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.










