“బస్తీ అభివృద్ధికి తలసాని బాట… ప్రజల మాటకే ప్రాధాన్యం.|

0
0

సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాంగోపాల్‌పేట్ డివిజన్‌లోని జీరా బస్తీలో అధికారులతో కలిసి పర్యటించారు. బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, రూ. 19 లక్షల వ్యయంతో నూతన కమిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ మరమ్మతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, కొత్త టాయిలెట్లు మరియు నీటి ట్యాంక్ నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. ప్రజా అభీష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడతామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తలసాని స్పష్టం చేశారు.

#sidhumaroju