మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్; పునరావృతం కావొద్దు.

0
3

ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రహస్య సమాచారం సమావేశానికి ముందే లీక్ కావడంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ గత చరిత్రను గుర్తు చేశారు. జలధార, సూర్య ఘర్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నెలకు నాలుగుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. రాబోయే 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి, పాలనలో పారదర్శకత పెంచాలని దిశానిర్దేశం చేసింది.