రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు: రూ.2,950 కోట్లు విడుదల.

0
3

ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరటనిస్తూ నిన్న ఒక్కరోజే రూ.2,950 కోట్ల బకాయిలను విడుదల చేసింది. గ్రాట్యుటీ, సరెండర్ లీవ్‌ బిల్లుల కోసం కేటాయించిన ఈ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో మొత్తం రూ.7,059 కోట్ల పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పీఎఫ్, పోలీస్ సరెండర్ లీవ్ బిల్లులు కూడా విడుదలయ్యాయి. దీర్ఘకాలంగా వేచిచూస్తున్న తమ బకాయిలు అందుతుండటంతో రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.