ఎన్నికల హామీ మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్లు స్థలం, రూ. 5 లక్షల నిర్మాణ సాయం అందించాలని KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విజయవాడ శాంతినగర్ ప్రాంతంలో ఇల్లు, పట్టాలు, పెన్షన్ల సమస్యలపై లబ్ధిదారులతో కలిసి అర్జీలు పూరించారు.
దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని, అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్న కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న (సోమవారం) కలెక్టరేట్ వద్ద నిర్వహించే ‘అర్జీల రాయబారం’లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.










