రేషన్ మాఫియాపై చర్యలు, డీఎస్ఓ సస్పెన్షన్ కు డిమాండ్.

0
2

బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై బహుజన సమాజ్ పార్టీ (BSP) నేత డాక్టర్ గుదే రాజారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని మధ్యవర్తులు సేకరించి, రైస్ మిల్లర్ల ద్వారా విదేశాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఆరోపించారు.

ఈ మాఫియాకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (DSO) సహకరిస్తున్నారని విమర్శిస్తూ, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దందాపై విజిలెన్స్ లేదా సీఐడీ విచారణ జరిపించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.