సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.

0
0

మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడటంతో, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న సి.ఐ. కళా వెంకటరమణ, ఎస్.ఐ. చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది