పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించేలా ముసాయిదా చట్టం సిద్ధం చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.
13-16 ఏళ్ల వారికి వయసుకు తగిన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా, ‘ఏజ్ టోకెన్’ వంటి విధానాలను పరిశీలిస్తున్నారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాలని ఈ ఉన్నత స్థాయి భేటీలో నిర్ణయించారు.










