అంగన్వాడీ టీచర్లకు అండగా ప్రభుత్వం

0
1

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి కలిసి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.

అంగన్వాడీ సేవలను డిజిటలైజ్ చేసి, పనిభారాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన టీచర్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే వేదికపై చిన్నారులకు యూనిఫారాలు పంపిణీ చేసి, ‘పోషణ్ పక్వాడా’ పోస్టర్లను ఆవిష్కరించారు.