ఇంద్రకీలాద్రి కొండ చర్యల పరిశీలనకు సాంకేతిక బృందం.

0
2

ఇంద్రకీలాద్రి కొండ చరియల పటిష్టతను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (NIRM) సాంకేతిక బృందం విజయవాడ చేరుకుంది. శాస్త్రవేత్త ప్రసన్న జైన్ నేతృత్వంలోని ఈ బృందం కొండపై రాళ్లు జారిపడే ప్రాంతాలను, ప్రతిపాదిత పాశుపాతాలయం, 2వ ఘాట్ రోడ్డు నిర్మాణ ప్రదేశాలను అత్యాధునిక సెన్సార్లు, రాడార్ల (GPR) సాయంతో విశ్లేషించనుంది. భక్తుల భద్రతే ధ్యేయంగా, కొండ చరియలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కార మార్గాలతో కూడిన సమగ్ర నివేదికను ఈ బృందం దేవస్థానానికి సమర్పించనుంది.