సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిరుమలగిరి లాల్ బజార్లో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. యువతకు జ్ఞానాన్ని పంచి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఈ లైబ్రరీని తీర్చిదిద్దారు.
త్వరలోనే బోయిన్పల్లి, బొల్లారంలలో కూడా గ్రంథాలయాలు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. తన సొంత నిధులతో విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు అధ్యాపకులను నియమిస్తామని, యువత ఈ వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
#sidhumaroju










