పుంగనూరు నియోజకవర్గం : కారు ఢీకొని వ్యక్తి పరిస్థితి విషమం

0
2

పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్న విశ్వనాథ రోడ్డు దాటుతుండగా, తిరుపతి వైపు వెళ్తున్న కారు ఆయనను ఢీకొంది.

ఈ ప్రమాదంలో గాయపడిన విశ్వనాథను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .