పుంగనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్‌లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షగురువారం రెండో రోజు కొనసాగింది. కన్వీనర్ హరిబాబు మాట్లాడుతూ బీసీల హక్కులకు న్యాయం జరగడం లేదని విమర్శించారు.
బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో 1000 ఎకరాలు, కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కుల గణన, 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబమూర్తి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










