బెల్లంపల్లి ఎంమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన వివరాలు

0
2

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ నెల 11 (శనివారం) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం వేమనపల్లి మండలంలోని సురారం, నాగారం గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం బెల్లంపల్లిలో కేజీబీవీ జూనియర్ కాలేజ్ నూతన గదులను ప్రారంభిస్తారు. సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, మరియు అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.