భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి

0
1

లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.

బుధవారం భీమారం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకొని పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు.