మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో డీసీపీ భాస్కర్, సబ్ కలెక్టర్ మనోజ్, ఇతర అధికారులతో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త ఆటంకాలను వెంటనే తొలగించాలని, రోడ్లపై అనధికారిక వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.










