మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి

0
3

ఈనెల 14న మందమర్రి ఏరియాలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏరియా జిఎం రాధాకృష్ణ తెలిపారు.

బుధవారం జిఎం కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ పార్కులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని, అనంతరం సిఆర్ క్లబ్ లో వేడుకలు నిర్వహించాలని సూచించారు.