మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరల పెరుగుదల.

0
1

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శుక్రవారం మార్కెట్‌కు 168 మెట్రిక్ టన్నుల టమోటాలు వచ్చాయి.

వ్యాపారులు మొదటి రకం టమోటాలను పది కిలోలకు రూ. 160, రెండో రకం రూ. 125, మూడో రకం రూ. 115 చొప్పున కొనుగోలు చేశారు. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.