తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింతగా పేరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
క్రమంగా రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.










