నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్, కౌన్సిలర్ విజయ్‌తో కలిసి 19వ వార్డులో పర్యటించారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను, పారిశుద్ధ్య వ్యవస్థను ఆమె పర్యవేక్షించారు.
వేసవిలో నీటి ఎద్దడి కలగకుండా “సమ్మర్ యాక్షన్ ప్లాన్” సిద్ధం చేస్తున్నామని, ఇప్పటికే కొత్త బోర్లు, మోటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.










