హైదరాబాద్ – విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు.

0
4

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికులకు శుభవార్త! ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఫ్లై 91’ (Fly 91) హైదరాబాద్ – విజయవాడ మధ్య తన విమాన సర్వీసులను ప్రారంభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సేవలను వర్చువల్‌గా ప్రారంభించారు.

సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సర్వీసు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. టైర్-2, టైర్-3 నగరాల మధ్య కనెక్టివిటీని పెంచడం ద్వారా రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణం సులభతరం కానుంది.