రాయచోటి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఇళ్లను సౌర వెలుగులతో నింపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్ కలిసి చిన్నమండెం మండలంలో సీఎం సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను ప్రారంభించారు.
తొలి దశలో 20,074 గృహాలకు రూ. 33.40 కోట్ల వ్యయంతో వీటిని మంజూరు చేశారు. ఒక్కో యూనిట్ విలువ రూ. 1.20 లక్షలు. ఈ పథకం ద్వారా పేదలకు విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.










