బాపట్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ (BSP) కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జ్ గుదే రాజారావు, జిల్లా కార్యదర్శి సామెల్ జాన్సన్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అణగారిన వర్గాల సామాజిక సమానత్వం, మహిళా విద్య మరియు బహుజన హక్కుల కోసం పూలే చేసిన పోరాటం నేటికీ మార్గదర్శకమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శీలం రోజెన్ బాబు మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










