తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ ఏకంగా 13.95 కోట్ల లడ్డూలను విక్రయించి, సుమారు రూ. 567 కోట్ల ఆదాయాన్ని గడించింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 1.76 కోట్లు పెరగడం విశేషం.
ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేస్తున్న టీటీడీ, భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా అందిస్తూ, అదనపు లడ్డూలను రూ. 50కి విక్రయిస్తోంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో లడ్డూ విక్రయాలు ఏటా కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి.










