పూలే జయంతి వేడుకల్లో మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్.

0
1

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ సమీకృత కార్యాలయాల సముదాయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, జాయింట్ కలెక్టర్ చంద్రయ్య, మరియు డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్య మహేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మహిళా విద్య, కుల నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.