సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్ లక్ష్మీనగర్‌లో తన మిత్రుడు గిరిధర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా కంటోన్మెంట్ ఏరియాలో చలివేంద్రాలను నిర్వహిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నామని తెలిపారు.
తన సేవా కార్యక్రమాల స్ఫూర్తితో స్నేహితులు కూడా ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
#sidhumaroju










