దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయం శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీ నటుడు సాయి దుర్గా తేజ్ శుక్రవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వేములవాడ క్షేత్ర దర్శనం తనకు ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చిందని, తెలంగాణ వైభవం గురించి సినిమా సెట్లలో సైతం చర్చించుకుంటామని ఈ సందర్భంగా హీరో సాయి దుర్గా తేజ్ పేర్కొన్నారు.










