బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసిన కుల సంఘ నాయకులు

0
1

సర్వ శాంతి -విశ్వ శాంతి’- ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విశ్వ గురు బసవన్న జయంతి సందర్బంగా ఏప్రిల్ 20 న ఎమ్మిగనూరు లోని గాంధీ నగర్ లో సుప్రీమ్ కోర్ట్ అడ్వకేట్ కాకర్ల చంద్ర శేఖర్ ఇంటి ఆవరణలో జరిగే సర్వ శాంతి -విశ్వ శాంతి హోమం మరియు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబందించిన బ్రౌచెర్ ను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విడుదల చేయటం జరిగింది.

ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ధర్మం పట్ల ప్రజలకు అవగాహన పెరిగి శాంతి వైపు నడుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.