భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్

0
3

అన్నమయ్య జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ డివిజన్ పోలీసులు కాలనీని చుట్టుముట్టి విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 50 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి ప్రతి ఇల్లు, వీధిని తనిఖీ చేశారు.

అనుమానితుల వివరాలు సేకరించడంతో పాటు పత్రాలు లేని వాహనాలపై పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు కాలనీ వాసులతో మాట్లాడి భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.