ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
సామాజిక అసమానతల నిర్మూలనకు, మహిళా విద్యకు పూలే చేసిన కృషిని వారు కొనియాడారు. సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలే సేవలను స్మరించుకున్నారు.










