రాష్ట్రంలో పీఎన్జీ కనెక్షన్ల పంపిణీ వేగవంతం చేయండి.

0
0

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే 6 నెలల్లో 10 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

‘దీపం’ పథకం లబ్ధిదారులు పీఎన్జీకి మారినా రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం-కాకినాడ గ్యాస్ పైప్‌లైన్ పనుల జాప్యంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో ఫోన్‌లో మాట్లాడి, పనులు వేగవంతం చేయాలని కోరారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, చౌకైన పీఎన్జీ వినియోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు.