చిత్తూరు జిల్లా పుంగనూరులో మదనపల్లి ఆర్టీసీ బస్సులో శుక్రవారం కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం రేపింది. సీటు విషయంలో వృద్ధురాలితో గొడవ పడి, ఆమెతో పాటు అడ్డువచ్చిన ప్రయాణికులను, చిత్రీకరిస్తున్న వారిని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు# కొత్తూరు మురళి.










