ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.

0
2

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. గత 11 నెలల్లో 272 మంది ఉద్యోగులు వివిధ అనారోగ్య సమస్యలతో మరణించడంతో, మే 1 నుంచి 45 ఏళ్లు పైబడిన సిబ్బందికి తప్పనిసరి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఎండీ ఎన్. బాలసుబ్రమణ్యం ఆదేశించారు.

డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి, ఇతర సిబ్బందికి ఏడాదికి ఒకసారి పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో కేవలం డ్రైవర్లకే పరిమితమైన ఈ నిబంధనను ఇప్పుడు అందరికీ వర్తింపజేయడం ద్వారా, జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణనష్టాన్ని నివారించాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.