ఏపీలో సముద్ర మత్స్య సంపద పరిరక్షణే లక్ష్యంగా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు (61 రోజులు) చేపల వేటపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపల సంతానోత్పత్తికి సహకరించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
వేట విరామ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సాయం అందజేయనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు బోటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. అలాగే, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల బీమాను రూ. 10 లక్షలకు పెంచుతూ భరోసా కల్పించింది.










