కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, సామాజిక సమానత్వానికి పూలే చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ వేడుకల్లో మానకొండూరు మాజీ జెడ్పిటిసి కౌంటర్ స్వరూప, యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని పూలే ఆశయాలను స్మరించుకున్నారు.










