జలధార కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్.

0
1

అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్ట్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. భూగర్భ జలాల పెరుగుదలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రతి చెరువు నీటితో నిండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమీక్షలో జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు తదితర అధికారులతో చర్చించి, పనులకే పరిమితం కాకుండా ఫలితాలపై దృష్టి పెట్టాలని తెలిపారు.