ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా గడియారం స్తంభం దగ్గర ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన జీవితాంతం కృషిచేశారు.
విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు










