మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బైక్ స్కిడ్ అయి మాలోతు శ్రీను (30) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అర్ధరాత్రి 108 సిబ్బంది బాధితుడిని కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ నైట్ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం.
సకాలంలో వైద్యం అందకపోవడంతో బాధితుడి పరిస్థితి విషమించగా, మెరుగైన చికిత్స కోసం నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.










