ధనకొండ గంగమ్మ గుడి లో దొంగతనం.

0
1

శుక్రవారం అర్థరాత్రి మదనపల్లెలోని ధనకొండ గంగమ్మ గుడిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిమ్మనపల్లి రోడ్డు, బసినికొండ శివారులోని ఈ గుడిలో దొంగలు గేట్లు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీని పగలగొట్టి నగదును దోచుకుని పారిపోయారు. గుడిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు నిర్భయంగా ఈ చోరీకి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.