అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో చౌక దుకాణానికి వెళ్తున్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, విచక్షణారహితంగా కొట్టి అత్యాచార యత్నానికి పాల్పడిన రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని శుక్రవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సిఐ సుబ్బారాయుడు తెలిపారు# కొత్తూరు మురళి.










