మేడ్చల్ జిల్లా నిజాంపేట పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జాల నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు జిల్లా జేసీ విజయేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
బాచుపల్లి మండలం సర్వే నంబర్ 233లో సుమారు 14 ఎకరాల భూమి అక్రమణకు గురవుతోందని, అక్కడ మినీ స్టేడియం, 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని కోరారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూముల్లో కమర్షియల్ షాపులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. వివిధ సర్వే నంబర్లలోని అక్రమ కట్టడాలను తొలగించి అంబేద్కర్ భవన్, లైబ్రరీ వంటి ప్రజావసరాలకు కేటాయించాలని కోరగా, సానుకూలంగా స్పందించిన జేసీ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.










