మదనపల్లెలో మే 9న హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ చైతన్య వేదిక నేతలు బాలాజీ, మధు నాయుడు తెలిపారు. గత ఆరేళ్లుగా ఈ శోభాయాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నామని శుక్రవారం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలు హిందూ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. మే 9న మధ్యాహ్నం 3 గంటలకు సొసైటీ కాలనీ రామాలయం వద్ద నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందని నేతలు వెల్లడించి, పోస్టర్లను ఆవిష్కరించారు.










